Home > తెలంగాణ > ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్.. సీఎం రేవంత్ క్లారిటీ!

ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్.. సీఎం రేవంత్ క్లారిటీ!

ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్.. సీఎం రేవంత్ క్లారిటీ!
X

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ కాబోతున్నారా అంటే అవుననే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్లను ఎమ్మెల్సీగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తానమి సీఎం స్పష్టం చేశారు. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేకమంది కాంగ్రెస్ నేతలు తమ టికెట్లను త్యాగం చేశారన్న సీఎం.. వాళ్లకు కూడా ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్ వంటి నేతలను మండలి పంపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు వంటి వాళ్లు మండలిలో ఉండేవారని, వాళ్లను చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని సీఎం స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రావాలని ఆయన ఆకాంక్షించారు.

Updated : 6 Jan 2024 4:34 PM GMT
Tags:    
Next Story
Share it
Top