Home > తెలంగాణ > జూనియర్ ఆర్టిస్టులను మించిపోయారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం సెటైర్లు

జూనియర్ ఆర్టిస్టులను మించిపోయారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం సెటైర్లు

జూనియర్ ఆర్టిస్టులను మించిపోయారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం సెటైర్లు
X

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూనియర్ ఆర్టిస్టులను మించిపోయారని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కవులు, కళాకారులకు ఢోకాలేదనే విషయం తెలుసునని, కానీ నటులకు కూడా కొదువలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరూపించారని ఎద్దేవా చేశారు. మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణానికి వస్తున్న స్పందనను చూసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అక్కసును వెళ్లగక్కుతున్నారని అన్నారు.

తెలంగాణ ఆడబిడ్డల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. ఉచిత ప్రయాణం వల్ల టీఎస్ఆర్టీసీ ఆదాయం కూడా పెరిగిందని అన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా రెండు నెలల్లో 15 కోట్ల 21 లక్షల మంది ప్రయాణించగా.. ఆర్టీసీకి 500 కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు. కిరాయి పైసలు కూడా రావడం లేదంటున్న ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను తగలబెట్టారంటే ఎలా అర్థం చేసుకోవాలని అన్నారు. కొత్త ఆటోను కొనాలంటే ఆ డ్రైవర్ కు డబ్బు ఎవరు ఇస్తున్నారు అనేది అర్థం కావడం లేదా అని అన్నారు. ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఇలాంటి పనులు చేయిస్తున్నారని అన్నారు.

ఒక నటుడేమో ఆటోలో అసెంబ్లీకి వస్తే.. ఇంకో నటుడేమో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొంటారు కానీ రూపాయి పెట్టి అగ్గిపెట్టె కొనరు అంటూ సీఎం సెటైర్లు వేశారు. ఉద్యమ సమయంలో ప్రజలు తెలంగాణ అంటే టీజీ అని నిర్ణయించుకున్నారని, కేంద్రం కూడా గెజిట్ నోటిఫికేషన్ లో టీజీ అనే పేర్కొన్న విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. కానీ కేసీఆర్ సర్కారు రాజకీయ స్వార్థం టీఎస్గా మార్చారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షల మేరకే టీఎస్ను టీజీగా మారుస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి అంటే అమ్మ, అక్క, చెల్లి గుర్తుకు రావాలని, శ్రమజీవికి ప్రతీకగా ఉండాలని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడూ కిరీటాలు పెట్టుకోలేదని అందుకే రాష్ట్ర చిహ్నాన్ని కూడా మారుస్తామని సీఎం రేవంత్ చెప్పారు.

Updated : 9 Feb 2024 5:26 PM IST
Tags:    
Next Story
Share it
Top