పారిశ్రామిక అభివృద్ధికి కడ్డుబడి ఉన్నాం.. సీఎం రేవంత్
X
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం వీలీ నేతృత్వంలోని హాన్ హాయ్ ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధుల బృందం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు, మౌళిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. పరిశ్రమలు ప్రోత్సాహకాలు అందిస్తామని, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో ఉంచడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఐటీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి రావడానికి ప్రయత్నిస్తామని, పెద్ద మొత్తంలో ఆ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.