CM Revanth Reddy : సీఎం రేవంత్ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు
Vijay Kumar | 27 Jan 2024 6:08 PM IST
X
X
సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి వచ్చిన వారు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రొ.కోదండరామ్, అమీర్ అలీఖాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తమను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినందుకు సీఎంకు వారు ధన్యవాదాలు తెలిపారు. తమ ఎన్నికకు సహకరించినందుకు సీఎం రేవంత్ , కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. కాగా గవర్నర్ కోటాలో తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరామ్, సియాసత్ పేపర్ మాజీ ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారస్ చేసింది. దానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ ఉత్తర్వులు కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
Updated : 27 Jan 2024 6:08 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire