Home > తెలంగాణ > ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్!

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్!

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్!
X

రాష్ట్రంలో ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు తెలపడంతో వారి రుణం తీర్చుకునే దిశగా రేవంత్ సర్కారు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జనవరి 5 లోపే వారికి జీతాలు వేయాలని రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపి అయినా సరే ప్రతి నెల 5వ తారీఖులోపే ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు వేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాల నిధులు ఆపి జనవరి 5 లోపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు జమ చేయాలని నూతన ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Updated : 31 Dec 2023 2:29 PM IST
Tags:    
Next Story
Share it
Top