Home > తెలంగాణ > 'పద్మ' పురస్కార గ్రహీతలకు రేపు సీఎం రేవంత్ సత్కారం

'పద్మ' పురస్కార గ్రహీతలకు రేపు సీఎం రేవంత్ సత్కారం

పద్మ పురస్కార గ్రహీతలకు రేపు సీఎం రేవంత్ సత్కారం
X

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 'పద్మ' అవార్డులను ప్రకటించగా.. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. 'పద్మ' అవార్డు గ్రహీతలను రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్, శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి వారిని సత్కరించనున్నారు. ఈ క్రమంలోనే పద్మ విభూషణ్ కు ఎంపికైనమాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో ఆరుగురి 'పద్మ' అవార్డ్ గ్రహీతలను సత్కరించనుంది రేవంత్ సర్కార్. ఇక పద్మశ్రీ అందుకున్నవారిలో యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, కేతావత్ సోమ్ లాల్(సాహిత్యం), కళల విభాగంలో ఆనందా చారి, సాహిత్యంలో కూరెళ్ల విఠలాచార్య, హరికథా కళాకారిణి ఉమామహేశ్వరిలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారిని సత్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.

కాగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన వారిని గుర్తించి ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించగా.. ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బీహార్‌ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు ప్రకటించింది. తాజాగా బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

Updated : 3 Feb 2024 12:06 PM GMT
Tags:    
Next Story
Share it
Top