Home > తెలంగాణ > ప్రజాయుద్ధ నౌక గద్దర్పై సీఎం రేవంత్ సూపర్ కవిత్వం

ప్రజాయుద్ధ నౌక గద్దర్పై సీఎం రేవంత్ సూపర్ కవిత్వం

ప్రజాయుద్ధ నౌక గద్దర్పై సీఎం రేవంత్ సూపర్ కవిత్వం
X

ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కవిత్వంతో తన భావాలను పంచుకుంటున్నారు. సీఎంగా అసెంబ్లీలో తన తొలి ప్రసంగంలోనే రేవంత్ కవిత్వంతో ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి పలు సందర్భాల్లో కవిత్వం ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. తాజాగా గద్దర్ జయంతి సందర్భంగా రవీంద్రాభారతిలో జరిగిన కార్యక్రమంలో గద్దర్ గురించి సీఎం మాట్లాడారు. ఈ క్రమంలోనే నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరు మీద అవార్డులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గద్దర్ జయంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి తనలోని భావాలను కవితా రూపంలో వెలిబుచ్చారు.

గద్దర్ గురించి సీఎం చెప్పిన కవిత ఇదే..

ఆయనతో గడిపిన క్షణాలు…

నాలో పోరాటాన్ని రగిల్చిన నిప్పు కణాలు

ఆయనతో సంభాషించిన మాటలు…

నేనొక ప్రజా గొంతుకై పేలిన తూటాలు

ఆయన గుర్తుగా మిగిలిన జ్ఞాపకాలు…

పేదల పక్షాన నేనెగరేసే బావుటాలు

గద్దరన్నా…

నీ స్ఫూర్తి…

జనం కోసం నువ్వు పడిన ఆర్తి…

నన్ను నిత్యం వెన్నంటి నడిపిస్తూనే ఉంటాయి

Updated : 31 Jan 2024 10:04 PM IST
Tags:    
Next Story
Share it
Top