Home > తెలంగాణ > అవినీతి, అక్రమాలు, అబద్ధాలకు కేరాఫ్ బీజేపీ.. అద్దంకి దయాకర్

అవినీతి, అక్రమాలు, అబద్ధాలకు కేరాఫ్ బీజేపీ.. అద్దంకి దయాకర్

అవినీతి, అక్రమాలు, అబద్ధాలకు కేరాఫ్ బీజేపీ.. అద్దంకి దయాకర్
X

అవినీతి, అక్రమాలు, అబద్ధాలకు కేరాఫ్ బీజేపీ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తమ నాయకురాలు దీపాదాస్ మున్షీపై అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు తన దివాళాకోరుతనం, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ప్రియరంజన్ దాస్ మున్షీ సతీమణి దీపాదాస్ మున్షీ దేశ రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత గల నాయకురాలని అన్నారు. ఓ టీవీ చర్చలో పాల్గొన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ నేతలు తమ సీట్లు కాపాడుకోవడానికి దీపాదాస్ మున్షీకి మెర్సిడెస్ బెంజీ కారు ఇచ్చారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ ఇన్ ఛార్జ్ గా దీపాదాస్ ఉండడంతో బీజేపీ నాయకులకు నిద్రపట్టడం లేదని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందని అని అన్నారు. బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని, దాంతో పసలేని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుల మాటలను తెలంగాన ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని, నిరాధార ఆరోపణలు చేస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఎంపీ సీటు కావాలంటే ఇంకో రకంగా ప్రయత్నం చేసుకోవాలి గానీ ఇలా అనవసర ఆరోపణలు చేయవద్దని హితవు పలికారు. వెంటనే దీపాదాస్ మున్షీకి క్షమాపణ చెప్పి తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ప్రభాకర్ ను డిమాండ్ చేశారు.



Updated : 20 Feb 2024 3:07 PM IST
Tags:    
Next Story
Share it
Top