Home > తెలంగాణ > ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలిస్తే తప్పేంటి?.. JaggaReddy

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలిస్తే తప్పేంటి?.. JaggaReddy

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలిస్తే తప్పేంటి?.. JaggaReddy
X

బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలవగా వారు కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీంతో తాము కాంగ్రెస్ లో చేరడం లేదని, నియోజకవర్గ అభివృద్ధి గురించే సీఎంను కలిశామని వారంతా వివరణ ఇచ్చారు. ఈనేథ్యంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గాంధీభవన్ వేదికగా స్పందించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు సీఎంను కలవొద్దనే రూల్ ఏం లేదని, ఒకవేళ కలిసినా అందులో తప్పేముందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ కలిసేవారని గుర్తు చేశారు. వాళ్లే గాక ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలిసే వారని అన్నారు.

అదే సంప్రదాయాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని, అందుకు ఆయనను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు. సీఎం రేవంత్ పాలనను చూసి మాజీ మంత్రి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే రేవంత్ రెడ్డిపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పార్టీ మార్పు అంశంపై కేటీఆర్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా పని చేసిన కేసీఆర్ .. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.

Updated : 24 Jan 2024 3:01 PM GMT
Tags:    
Next Story
Share it
Top