హైదరాబాద్ లో ప్రారంభమైన సీపీఐ జాతీయ సమావేశాలు
X
సీపీఐ జాతీయ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ సమితి సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలు, పార్టీ సభ్యత్వం, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, పలు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల్లో ఏ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే పలు అంశాల గురించి కూడా ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పశ్చిమ బెంగాల్ లో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కావాల్సిన చర్యలు, అలాగే బీహార్ లో తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో అక్కడ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.