Home > తెలంగాణ > Health Department : వైద్యారోగ్య శాఖలో డిప్యుటేషన్లు రద్దు

Health Department : వైద్యారోగ్య శాఖలో డిప్యుటేషన్లు రద్దు

Health Department : వైద్యారోగ్య శాఖలో డిప్యుటేషన్లు రద్దు
X

వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యుటేషన్ లో ఉన్నవారు వెంటనే తమ పూర్వ స్థానాల్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 8న సాయంత్రంలోపు రిపోర్టు చేయాలని వైద్యారోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హెచ్వోడీలు తక్షణమే చర్యలు తీసుకొని నివేదిక అందజేయాలని తెలిపింది. ఒకవేళ ఏదైనా అత్యవసరం పరిస్థితి ఉంటే హెచ్వోడీలు తమ జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకొని డిప్యుటేషన్ ద్వారా వచ్చిన వాళ్లను కొనసాగించుకోవచ్చని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఈ ఉత్తర్వులను అత్యసర నోటీసులుగా భావించాలని కోరింది.

కాగా పలు జిల్లాలో వైద్య విభాగంలో పలువురు వైద్యులు, ఉద్యోగులు జిల్లా అధికారులను మంచి చేసుకొని తమకు ఇష్టం ఉన్న ప్రాంతాలకు డిప్యుటేషన్ పై వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. విధులు నిర్వహిస్తున్న వారిలో మెడికల్ ఆఫీసర్ స్థాయిలో పలువురు జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ పరిధిలోని పలు ప్రోగ్రాంలకు అధికారులుగా ఉన్నారు. అలాగే సీహెచ్వోలు, ఎంపీహెచ్వోలు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఆఫీస్ సబార్డినేట్లు, సహాయక సిబ్బంది ఉన్నారు. జిల్లా స్థాయిలో డిప్యుటేషన్లు డీఎంహెచ్వోల స్థాయిలో కావడంతో గతంలో దందా బాగానే నడిచినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated : 7 Feb 2024 3:41 PM IST
Tags:    
Next Story
Share it
Top