Home > తెలంగాణ > Bhatti Vikramarka : ఫార్ములా ఈ రేస్ విషయంలో అసత్య ప్రచారం.. డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka : ఫార్ములా ఈ రేస్ విషయంలో అసత్య ప్రచారం.. డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka : ఫార్ములా ఈ రేస్ విషయంలో అసత్య ప్రచారం.. డిప్యూటీ సీఎం భట్టి
X

హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ రద్దుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. సెక్రటేరియట్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు మాజీ మంత్రలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈ రేసు రద్దుతో రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదనడం సరైంది కాదని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లడటం సరికాదని అన్నారు. ఫార్ములా ఈ రేస్ విషయమై గతంలో ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగిందని తెలిపారు. ప్రభుత్వం, ఫార్ములా ఈ రేస్, ఏస్ నెక్స్ట్ జెన్ మధ్య ఒప్పందం జరిగిందని అన్నారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ట్రాక్ సదుపాయం కల్పించాలని అన్నారు. కానీ ట్రై పార్టీ ఒప్పందాన్ని బై పార్టీ ఒప్పందంగా మార్చారని అన్నారు. రేస్ ద్వారా టికెట్లు అమ్ముకుని లబ్ధి పొందాలని ఎస్ నెక్స్ట్ జెన్ యత్నించిందని పేర్కొన్నారు.

ఫార్ములా ఈ రేస్ తో రాష్ట్రానికి వచ్చే లాభమేంటని ప్రశ్నించారు. ఈ ఫార్ములా రేస్ కు రూ.110 కోట్ల చెల్లించేలా ఒప్పందం ఉండగా ఇప్పటికే రూ.55 కోట్లు కట్టారని తెలిపారు. ఈ కాంట్రాక్టు విషయంలో కేబినేట్ ఆమోదం లేదని, కనీసం బిజినెస్ రూల్స్ ను పాటించకుండా మౌఖిక ఆదేశాలతో రూ.55 కోట్లు ప్రజా సొమ్మును దుర్వినియోగం చేశారని అన్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిని వర్గాలు ఉన్నాయన్న భట్టి.. ఫార్ములా ఈ రేస్ ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం ఉండదని అన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వం తప్పు చేసిందని, గత ప్రభుత్వ తప్పిదాలను కచ్చితంగా సరిచేస్తామని అన్నారు. ప్రతి పైసా ప్రజల అవసరాల కోసమే ఖర్చు పెడుతామని అన్నారు. రాష్ట్రాన్ని పచ్చిగా అమ్మకానికి పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆరోపించారు. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్తామని అన్నారు.




Updated : 9 Jan 2024 3:54 PM IST
Tags:    
Next Story
Share it
Top