Home > తెలంగాణ > ప్రజా పాలన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం

ప్రజా పాలన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం

ప్రజా పాలన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
X

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమాక్క అధ్యక్షతన శుక్రవారం ప్రజా పాలన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లోని ఐదు గ్యారెంటీల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన దరఖాస్తుల కంప్యూటరీకరణను వేగవంతం చేయాలని అధికారులన్నారు. దరఖాస్తుల్లో తప్పులు దొర్లితే నేరుగా లబ్దిదారులకు ఫోన్ చేసి సరియైన వివరాలను ఎంట్రీ చేయాలని కోరారు. జనవరి 17 వరకు దరఖాస్తుల ఎంట్రీ పూర్తి కావాలని అన్నారు. ఈ నెలాఖరులోగా అర్హులను గుర్తించి తుది జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా,హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




Updated : 12 Jan 2024 2:30 PM GMT
Tags:    
Next Story
Share it
Top