బడ్జెట్ తయారీపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
Vijay Kumar | 18 Jan 2024 6:37 PM IST
X
X
రాష్ట్ర సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై సమీక్ష నిర్వహించారు. రెవిన్యూ, హౌజింగ్, ఐ ఆండ్ పీఆర్ శాఖల ఉన్నతాధికారులతో ఈయన సమీక్ష నిర్వహించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖల్లో అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు, నిర్వహణ వ్యయంపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.
అనవసర ఖర్చులకు చోటు ఇవ్వొద్దని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి బడ్జెట్ లో పొందుపరచాలని అన్నారు. ఈ సమావేశానికి హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, శ్రీనివాసరాజు, ఐ ఆండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
Updated : 18 Jan 2024 6:37 PM IST
Tags: Deputy CM Bhatti Vikramarka review budget preparation minister ponguleti srinivas reddy aravind kumar navin mittal ashok reddy
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire