Home > తెలంగాణ > సింగరేణిపై డిప్యూటీ సీఎం భట్టి రివ్యూ

సింగరేణిపై డిప్యూటీ సీఎం భట్టి రివ్యూ

సింగరేణిపై డిప్యూటీ సీఎం భట్టి రివ్యూ
X

సింగరేణిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రివ్యూ నిర్వహించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో జరిగిన ఈ రివ్యూకు సంస్థ సీఎండీ శ్రీధర్, ఓఎస్డీ కృష్ణభాస్కర్, డైరెక్టర్స్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సంస్థ ఆర్థిక స్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంస్థను లాభాల బాటలో పట్టించడానికి కావాల్సిన అన్ని మార్గాలను అన్వేషించాలని సూచించారు. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. సంస్థకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయం అందిస్తామని అన్నారు. కాగా ఇటీవల నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల్లో ఎర్ర జండా రెప రెపలాడింది. ఈ ఎన్నికల్లో కార్మికులు ఎర్రజెండాకే పట్టం కట్టారు.భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటియుసీ ఈసారి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయభేరి మోగించింది. గత 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కేవలం రెండు డివిజన్లకు మాత్రమే పరిమితమైన ఏఐటీయూసీ ఈ ఎన్నికల్లో ఐదు చోట్ల విజయం సాధించింది. అయితే ప్రాతినిద్యం లేని ఐఎన్టీయూసీ ఆరు చోట్ల గెలుపొందింది. గతంలో తొమ్మిది డివిజన్లలో ప్రాతినిధ్యమున్న టీజీబీకేఎస్ మాత్రం ఈసారి జాడలేకుండా పోయింది.



Updated : 29 Dec 2023 2:51 PM IST
Tags:    
Next Story
Share it
Top