Home > తెలంగాణ > గత ప్రభుత్వం ఆ సంస్థలను ధ్వంసం చేసింది: డిప్యూటీ సీఎం భట్టి

గత ప్రభుత్వం ఆ సంస్థలను ధ్వంసం చేసింది: డిప్యూటీ సీఎం భట్టి

గత ప్రభుత్వం ఆ సంస్థలను ధ్వంసం చేసింది: డిప్యూటీ సీఎం భట్టి
X

ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్డబ్ల్యూఎస్ కింద ఏర్పాటు చేసిన అన్ని సంస్థలను, వ్యవస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని అన్నారు. వాటికి తాళాలు వేసి నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. దీనిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడుతుందని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే ప్రజలకు మంచి నీటి కష్టాలు పోయాయని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కానీ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చాలా మంది ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగడం లేదని అన్నారు.

గతంలో ఉన్న బోర్ వెల్స్, ఓపెన్ వెల్స్ నీళ్లతోనే చాలా మంది గోండు, గిరిజన ప్రజలు తమ దాహార్తిని తీర్చుకుంటున్నారని అన్నారు. నల్గొండలో ఫ్లోరోసిస్ పోయిందంటే అతి తమ వల్లేనని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, కానీ నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపడానికి కాంగ్రెస్ హయాంలో కూడా చాలా కార్యక్రమాలు చేపట్టామని మంత్రి తెలిపారు. కాగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ నడిచింది. నిన్నటి వరకు సాఫీగా సాగిన సభ.. నేడు విమర్శలు ప్రతి విమర్శలతో దద్దరిల్లింది. రాష్ట్ర దుస్థితికి మీరంటే మీరు కారణమంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి.

Updated : 16 Dec 2023 11:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top