భద్రాద్రి పవర్ ప్లాంట్ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
Vijay Kumar | 30 Dec 2023 3:07 PM IST
X
X
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ప్లాంట్ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరంగా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం వెంట విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, ఓఎస్డీ కృష్ణ భాస్కర్, స్థానిక శాసనసభ్యులు,నాయకులు, సంబధిత అధికారులు పాల్గొన్నారు. కాగా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శన కోసం డిప్యూటీ సీఎం బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు.
Updated : 30 Dec 2023 3:07 PM IST
Tags: Deputy CM Mallu Bhatti Vikramarka Bhadradri Thermal Power Plant project ias officials krshna bhaskar rizvi works
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire