Home > తెలంగాణ > ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. తాజాగా కవితకు నోటీసులు రావడంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే కవిత ఈడీ విచారణకు వెళ్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో గతంలోనూ ఈడీ కవితను మూడు సార్లు విచారించింది.అయితే విచారణకు రావాలంటూ ఈడీ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయగా.. రేపటి విచారణకు తాను రాలేనంటూ ఆమె ఈడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు ఉన్నందున తాను విచారణకు రాలేనంటూ తన లేఖలో కవిత పేర్కొన్నారు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. అదేవిధంగా ఇదే కేసు విషయమై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కూడా విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాను హాజరు కాలేకపోతున్నానంటూ కేజ్రీవాల్ ఈడీకి లేఖ రాశారు.

Updated : 15 Jan 2024 3:05 PM GMT
Tags:    
Next Story
Share it
Top