KTR : టెన్త్ విద్యార్థులకు కేటీఆర్ సాయం.. ఏం చేశారంటే?
X
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్నవాళ్లకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే కేటీఆర్.. తాజాగా పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. తన నియోజకవర్గం సిరిసిల్లలో ఈ సారి పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్ సంస్థ ద్వారా ఆయన ఈ వస్తువులు అందజేశారు. ఈ సందర్భాగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 3 వేల మంది విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేశారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. ఈ సందర్భంగా టెన్త్ విద్యార్థులకు కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కాగా కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రజా సమస్యలతో పాటు రాజకీయాలకు సంబంధించి పలు అంశాలపై ఆయన ఎప్పటికప్పుడూ స్పందింస్తుంటారు. ఈ క్రమంలోనే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందరో పసి పిల్లలకు వైద్యం చేయించారు. అలాగే పేద పిల్లల చదువుకు అనేక రకాలుగా తోడ్పాటు అందించారు. ఇక ఇటీవల గల్ఫ్ జైలు నుంచి ఐదుగురు తెలంగాణ యువకులు విడుదలై రాష్ట్రానికి రాగా.. వారి విడుదలలో కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా తెలంగాణలో ఎస్సెస్సీ-2024 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ అయింది. 10వ తరగతి పరీక్షలు 2024 మార్చి 18 నుండి ఏప్రిల్ 2, 2024 వరకు కొనసాగనున్నాయి.