బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్గా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు
Vijay Kumar | 22 Feb 2024 10:05 PM IST
X
X
మాజీ డీజీపీ జె.పూర్ణచంద్రరావు బీఎస్పీలో చేరారు. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్, బీఎస్పీ తెలంగాణ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో ఆయన బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావును బీఎస్పీ చీఫ్ మాయావతి ఆదేశాల మేరకు బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాలకు బీఎస్పీ కోఆర్డినేటర్లుగా రిటైర్డ్ ఐపీఎస్ లు రావడం గమనార్హం. 2022 జూన్ 9 న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు.
Updated : 22 Feb 2024 10:05 PM IST
Tags: Former DGP J.Purnachandra Rao BSP AP Coordinator telangana bsp president rs praveen kumar bsp mp ramjee goutham bahenji mayavati telugu states chief coordinator
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire