Home > తెలంగాణ > సీఎం రేవంత్ తో మాజీ గవర్నర్ నరసింహన్ భేటి

సీఎం రేవంత్ తో మాజీ గవర్నర్ నరసింహన్ భేటి

సీఎం రేవంత్ తో మాజీ గవర్నర్ నరసింహన్ భేటి
X

సీఎం రేవంత్ రెడ్డిని మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కలిశారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి వచ్చిన నరసింహన్.. సీఎం రేవంత్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ నరసింహన్ కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై ఇరువురు చర్చించారు.

ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా నరసింహన్ మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో ఆయన ఉమ్మడి ఏపీకి గవర్నర్‌గా వచ్చారు. 2009 నుంచి రాష్ట్రం విడిపోయే వరకు గవర్నర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు తెలంగాణకు గవర్నర్‌గా పని చేశారు. నరసింహన్ తర్వాత తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్‌గా వచ్చారు.

Updated : 6 Jan 2024 6:04 PM IST
Tags:    
Next Story
Share it
Top