Home > తెలంగాణ > కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందనే నమ్మకం ఉంది.. గడల శ్రీనివాసరావు

కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందనే నమ్మకం ఉంది.. గడల శ్రీనివాసరావు

కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందనే నమ్మకం ఉంది.. గడల శ్రీనివాసరావు
X

నిత్యం ఏదో ఓ కామెంట్స్ తో వార్తల్లో ఉంటారు తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు. తాజాగా ఆయన మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లోకి రావడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా జీవితంలోకి రావడానికే తన 25 ఏళ్ల ఉద్యోగ జీవితానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వాతావరణం ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని అని అన్నారు. అందుకే అవకాశం వస్తే ఆ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలబడాలని అనుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల తాను ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్లికేషన్ పెట్టుకున్నానని అన్నారు. ఇప్పటికే తాను ప్రజా సేవలో ఉన్నానన్న ఆయన.. ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్తగూడెంలో సేవలు అందిస్తున్నానని అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, తనకు పార్టీ టికెట్ ఇస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కాగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు గడల శ్రీనివాసరావు.. బీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డారు. కొత్తగూడెం టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నం చేశారు. వీలు కుదిరినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కొత్తగూడెంలో సామాజిక సేవా కార్యక్రమాలతో కేసీఆర్ దృష్టిలో పడేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలోనే హెల్త్ డైరెక్టర్ పదవిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఓ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కూడా గడల శ్రీనివాసరావుకు క్లాస్ పీకినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాగా ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కాంగ్రెస్ పార్టీకి అప్లికేషన్ పెట్టుకున్నారు.

Updated : 4 Feb 2024 9:00 PM IST
Tags:    
Next Story
Share it
Top