Home > తెలంగాణ > Harish Rao : రుణమాఫీ ఒక్కరికైనా ఇచ్చారా? : మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao : రుణమాఫీ ఒక్కరికైనా ఇచ్చారా? : మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao : రుణమాఫీ ఒక్కరికైనా ఇచ్చారా? : మాజీ మంత్రి హరీశ్ రావు
X

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి సంతకం రూ.2 లక్షల రుణమాఫీ రద్దుపై పెడుతామన్నారని, కానీ ఒక్కరికీ కూడా రుణమాఫీ చేయలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అన్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ చేశారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞతల సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని 82 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారని అన్నారు. సిద్ధిపేట ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. కేవలం 1.8శాతం ఓట్లతోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందని, ఇంకో నాలుగు లక్షల ఓట్లు వచ్చి ఉంటే గెలిచేవాళ్లమని అన్నారు. అయినా 39 మంది ఎమ్మల్యేలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందని అన్నారు. ఇక అధికారం కోల్పోయామని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజా తీర్పును గౌరవిస్తామని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమని, బీఆర్ఎస్ కు ఆటుపోట్లు కొత్తకాదని అన్నారు. 22 పార్టీ ప్రస్థానంలో ముళ్లబాట చూశాం.. పూల బాట చూశామని అని అన్నారు.

దక్షిణ భారతదేశంలో వరుసగా మూడోసారి ఏ పార్టీ కూడా అధికారం చేపట్టలేదని, అదే ఫలితం తెలంగాణలో కూడా వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో దావోస్ కు పోతే దండగ అన్నారని, మరి నేడు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. చేసిన మంచిని బీఆర్ఎస్ చెప్పకోలేకపోయిందన్న హరీశ్ రావు.. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్న ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు త్వరలోనే పూర్తిగా అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ.15 వేల రైతు బంధు ఇస్తామని చెప్పారని, కానీ ఇంతవరకు రైతు బంధు కింద కనీసం రూ.10 వేలు సరిగ్గా విడుదల చేయలేదని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క బటన్ నొక్కితే రైతుల అకౌంట్లలో డబ్బులు, వాళ్ల ముఖాల్లో ఆనందం కనపడేదని అన్నారు.




Updated : 27 Jan 2024 4:10 PM IST
Tags:    
Next Story
Share it
Top