Harish Rao : కేసీఆర్‌కు పని తనం తప్ప పగతనo తెలియదు.. మాజీ మంత్రి హరీశ్ రావు
X
మాజీ సీఎం కేసీఆర్‌కు పని తనం తప్ప పగతనo తెలియదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయని మండిపడ్డారు. కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పూనుకుని ఉంటే కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండే వారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల దాటినా ఇంకా హామీల అమలుపై కాంగ్రెస్ అన్నిటికీ 100 రోజుల డెడ్ లైన్ పెడుతోందని ఎద్దేవా చేశారు. వంద రోజుల తర్వాత ప్రజలే కాంగ్రెస్‌పై చీటింగ్ కేసులు పెడతారన్నారు. ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు గ్రూపులు ఉన్నాయని చెప్పారు. ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్, ఒకటీ టీడీపీ కాంగ్రెస్, ఇంకోటి ఒరిజినల్ కాంగ్రెస్ అని హరీశ్‌రావు సెటైర్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిందని, ఇంకో 11 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అత్యల్ప మెజారిటీతో ఓడిపోయారని గుర్తు చేశారు. ఓటమికి గల కారణాలపై సమీక్షించుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. పూర్తి స్థాయిలో చలనం లేదని అన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఒరిజినాలిటీని బయటపెట్టిందని విమర్శించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.