Home > తెలంగాణ > రేవంత్ కు ఇంద్రవెల్లి స్థూపాన్ని తాకే హక్కే లేదు.. మాజీ మంత్రి జోగు రామన్న

రేవంత్ కు ఇంద్రవెల్లి స్థూపాన్ని తాకే హక్కే లేదు.. మాజీ మంత్రి జోగు రామన్న

రేవంత్ కు ఇంద్రవెల్లి స్థూపాన్ని తాకే హక్కే లేదు.. మాజీ మంత్రి జోగు రామన్న
X

సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి స్థూపాన్ని తాకే హక్కే లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జోగు రామన్న అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇంద్రవెల్లి వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇంద్రవెల్లిలో వందలాది ఆదివాసీలను చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. ప్రజా సంఘాల కృషితో ఇంద్రవెల్లి స్థూపాన్ని నిర్మిస్తే ఆ స్థూపాన్ని కూల్చిందే కాంగ్రెస ప్రభుత్వం అని మండిపడ్డారు. అలాంటిది నేడు సీఎం రేవంత్ అక్కడికి వెళ్లడం విచిత్రంగా ఉందని అన్నారు. స్థూపం వద్దకు ఎవరినీ పోనీయకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అడ్డుకున్నాయని అన్నారు. కనీసం గద్దర్ ను కూడా అక్కడికి వెళ్లనివ్వలేదని అన్నారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇంద్రవెల్లికి వెళ్లడానికి స్వేచ్ఛను కల్పించారని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాడు ఏం మాట్లాడారో సీఎంగా కూడా రేవంత్ అలాగే మాట్లాడారని అన్నారు. నాగోబా దేవాలయానికి కేసీఆర్ నిధులు ఇస్తే రేవంత్ ప్రారంభోత్సవాలు చేశారని, కేవలం కోటి రూపాయల పనులకు రేవంత్ కు శంఖు స్థాపన చేశారని అన్నారు. సీఎం హోదాలో ఆయన అన్ని అబద్ధాలు ఆడుతున్నారని, తన భాష తో రేవంత్ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమాన పరిచారని అన్నారు.

కేసీఆర్ హయాంలోనే అదిలాబాద్ అభివృద్ధి

ఆదిలాబాద్ కు కేసీఆర్ హయం లోనే నిదులొచ్చాయని, 220 కి పైగా తండాలు, గూడెంలు గ్రామ పంచాయతీలు అయ్యాయని అన్నారు. జోడేఘాట్ ను 22 కోట్ల రూపాయలతో అభివృద్ది చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. గిరి వికాసం కింద 3 వేలకు పైగా ఉచిత్ వ్యవసాయ బోర్ల ను గిరిజనులకు అందజేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. కొత్తగా జిల్లాలు మండలాలు మున్సిపాలిటీ లు రెవెన్యూ డివిజన్లు చేయడం వల్ల ఆదిలా బాద్ ఉమ్మడి జిల్లా స్వరూపం మారిపోయిందని అన్నారు. కేసీఆర్ హయాంలో 13 మధ్యతరహా ప్రాజెక్టులను 800 కోట్ల రూపాయలతో పూర్తి చేశామని, 50 ఏండ్లలో కాంగ్రెస్ ఏనాడు ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోలేదని ఆరోపించారు. చనాకా కొరటా ప్రాజెక్టును గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కేసీఆర్ ప్రభుత్వమే ఆ ప్రాజెక్టు ను పట్టించుకుందని అన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న ఆయన.. రేవంత్ అధికారుల దగ్గర వివరాలు తెప్పించుకుని వాస్తవాలు మాట్లాడాలని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి ఎంపీల అమ్మకం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. కేసీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని జోగు రామన్న హెచ్చరించారు.

Updated : 3 Feb 2024 9:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top