Home > తెలంగాణ > బీసీ కులగణనకు సంపూర్ణ మద్దతు ఇస్తాం.. KTR

బీసీ కులగణనకు సంపూర్ణ మద్దతు ఇస్తాం.. KTR

బీసీ కులగణనకు సంపూర్ణ మద్దతు ఇస్తాం.. KTR
X

బీసీ కులగణనకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బీసీ కులగణనను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని తెలిపారు.

బీసీ కులగణనపై అసెంబ్లీలో కొనసాగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. బీసీల కోసం ముందు నుంచి పోరాటం చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో కూడా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని డిమాండ్ చేశారని తెలిపారు. మిత్రపక్షంలో ఉంటూ కూడా ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టాలని కేసీఆర్ ఆనాడు డిమాండ్ చేశారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రెండు సార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, కానీ మోడీ ప్రభుత్వం దానిపై స్పందించలేదని అన్నారు.

అన్ని రాష్ట్రాల్లో బీసీ మినిస్ట్రీలు ఉన్నాయన్న కేటీఆర్.. అలాగే కేంద్రంలో కూడా ఓబీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని, ఓబీసీ మినిస్ట్రీ వస్తే బడ్జెట్ లో ఆ శాఖకు 5 శాతం నిధులు కేటాయించినా ఓబీసీలకు 5 లక్షల కోట్లు వస్తాయని అన్నారు. బీహార్ లో మహాఘట్ బంధన్ కూటమి ప్రభుత్వం బీసీ కులగణనకు ఆమోద ముద్ర వేసిందని, కానీ చట్టపరమైన సమస్యలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయిందని అన్నారు. అందుకే బీసీ కులగణనకు సంబంధించిన ఈ బిల్లుకు చట్టం రూపం కల్పించాలని కోరారు. న్యాయ నిపుణుల నుంచి సూచనలు, సలహాలు తీసుకొని పకడ్బంధీగా బీసీ కులగణన బిల్లుకు ఆమోదం తెలపాలని అన్నారు. అందుకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను రెండు రోజలు పొడిగించాలని కేటీఆర్ కోరారు.

Updated : 16 Feb 2024 10:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top