Home > తెలంగాణ > రాష్ట్రంలోనే పుష్కలంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి.. KTR

రాష్ట్రంలోనే పుష్కలంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి.. KTR

రాష్ట్రంలోనే పుష్కలంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి.. KTR
X

రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలెవరూ దుబాయి లాంటి దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ ఇటీవల దుబాయి నుంచి వచ్చిన వ్యక్తులను కలిశారు. దుబాయ్ లో వారు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి కోసం దుబాయ్​ వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 5 గురు వ్యక్తులు 18 ఏండ్లు దుబాయ్ జైలులో మగ్గి తిరిగి సొంతగడ్డకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బ్రోకర్ల మాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు పోయి జీవితాలను దుర్భరం చేసుకోవద్దని అన్నారు.

గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, అందుకు అవసరమైన సహాయాన్ని వ్యక్తిగతంగా చేస్తానని వారికి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దుబాయి బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కేటీఆర్ కోరారు.

కాగా రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఐదుగురు ఉపాధి కోసం దుబాయికెళ్లారు. అయితే ఊహించని విధంగా ఓ కేసులో వారు నేరస్థులుగా మారారు. ఈ కేసులో 10 మంది ఆరోపణలు ఎదుర్కోగా.. తెలంగాణకు చెందిన ఈ ఐదుగురు అందులో ఉన్నారు. దీంతో తొలుత పదేళ్లు జైలు శిక్ష విధించిన దుబాయి కోర్టు.. నేరం నిరూపణ కావడంతో ఆ శిక్షను 25 ఏళ్లకు పెంచింది. ఈ విషయం మీడియా ద్వారా 2011లో కేటీఆర్​ దృష్టికి వెళ్లడంతో వారిని సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నం చేశారు. స్వయంగా నేపాల్‌​కు వెళ్లి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ఇచ్చి క్షమాభిక్ష రాయించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం మారడంతో నిబంధనలు కఠినతరం కావడంతో జాప్యం జరిగింది. బాధితులకు అక్కడి భాష తెలియకపోవడం, ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఇబ్బంది పడుతున్న కుటుంబ సభ్యులకు కేటీఆర్ ఆర్థిక సహాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల దుబాయి బాధితులు తమ సొంతగడ్డ అయిన సిరిసిల్లకు చేరుకున్నారు.

Updated : 28 Feb 2024 11:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top