Home > తెలంగాణ > బొడిగె శోభను పరామర్శించిన కేటీఆర్

బొడిగె శోభను పరామర్శించిన కేటీఆర్

బొడిగె శోభను పరామర్శించిన కేటీఆర్
X

ఇటీవల మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త గాలయ్య మృతి చెందగా బుధవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బొడిగె శోభ కుటుంబాన్ని ఓదార్చారు. బొడిగె గాలన్న మృతి తనను ఎంతో బాధించిందని కేటీఆర్ అన్నారు. బొడిగె గాలన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి పని చేశారని గుర్తు చేశారు. గాలన్న తన సతీమణి శోభకు అండగా ఉంటూనే శంకరపట్నం జడ్పీటీసీగా ప్రజలకు సేవ చేశారని అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యేగా ఉన్నప్పడు శోభకు గాలన్న వెన్నంటి ఉన్నారని అన్నారు. గాలన్న చిన్నతనం నుంచే పేద ప్రజల సమస్యలపై పోరాటం చేయడంతో పాటు వామపక్ష పార్టీలలో పని చేశారని, ఆయన మృతి తీరని లోటు అని కేటీఆర్ అన్నారు. కాగా అంతకు ముందు బొడిగె శోభ కుటుంబాన్ని బీజేపీ సీనియర్ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తదితరులు పరామర్శించారు.

Updated : 24 Jan 2024 10:04 PM IST
Tags:    
Next Story
Share it
Top