Home > తెలంగాణ > అన్ని పార్టీలు మావే.. మాజీ మంత్రి మల్లారెడ్డి

అన్ని పార్టీలు మావే.. మాజీ మంత్రి మల్లారెడ్డి

అన్ని పార్టీలు మావే.. మాజీ మంత్రి మల్లారెడ్డి
X

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి స్టైలే వేరు. నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటారు ఆయన. అలాంటి పనే ఈరోజు కూడా చేశారు. ఈ క్రమంలోనే తన రాజకీయ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది స్టేట్ గా నిలిచారు. రిపబ్లిక్ డే సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఓ విలేకరి పార్టీ మారుతున్నారని, బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. నిజమేనా అని మల్లారెడ్డిని అడిగారు. దానికి ఆయన నవ్వుతూ బదులిస్తూ.. " నేను బీజేపీలోకి పోతా.. కాంగ్రెస్ లోకి పోతా.. అన్ని పార్టీలు మావే" అంటూ సమాధానమిచ్చారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మల్లారెడ్డి తాజా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం కాగా.. రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని అన్నారు. గతంలో జరిగిన గొడవలు దృష్టిలో పెట్టుకొని తనపై కేసులు పెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ క్రమంలోనే మొదట్లో ఆయన కాంగ్రెస్ లోకి పోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆయన కొట్టిపారేశారు. తాను బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తేలేదని, కేసీఆర్ వెంటే ఉంటానని అన్నారు.




Updated : 26 Jan 2024 8:03 PM IST
Tags:    
Next Story
Share it
Top