Home > తెలంగాణ > రైతు బంధును ఎంత మందికి ఇచ్చారో చెప్పాలి.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

రైతు బంధును ఎంత మందికి ఇచ్చారో చెప్పాలి.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

రైతు బంధును ఎంత మందికి ఇచ్చారో చెప్పాలి.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
X

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంత మందికి రైతు బంధు ఇచ్చారో చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు బంధు రాక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించామా అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ అని ఎన్నికల సమయంలో చెప్పారని, కానీ ఇంతవరకు ఒక్కరికీ కూడా రుణమాఫీ చేయలేదని అన్నారు. అలాగే వరికి రూ.500 బోనస్ ఇస్తామని అన్నారని, ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. అలాగే పెంచిన రైతు బంధును ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పాలని అన్నారు.

100 రోజుల్లోపు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, లేకుంటే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఢిల్లీలో తెలంగాణ నేతలు అంటే బీఆర్ఎస్ నేతలే గుర్తుకు వస్తారని అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలను ఎంపీలుగా గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు పట్టం కట్టడం ఖాయమని అన్నారు.

Updated : 5 Jan 2024 1:37 PM GMT
Tags:    
Next Story
Share it
Top