రాష్ట్రపతి ముర్మును కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్ కు వచ్చిన ఆయన రాష్ట్రపతి ముర్ముకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రపతి ముర్మును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రపతితో ఎలాంటి రాజకీయాలు చర్చించ లేదని అన్నారు. ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ విజయం కోసం పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం పలు కమిటీల నియామకంపై కూడా చర్చించినట్లు సమాచారం. కేంద్ర కేబినేట్ మీటింగ్ కు హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా అంతకు ముందు తెలంగాణ రాజకీయాలపై మాట్లాడిన కిషన్ రెడ్డి.. తాను కేసీఆర్ బినామీ అన్న కాంగ్రెస్ ఆరోపణలను కొట్టిపారేశారు. కాంగ్రెస్ నేతలే కేసీఆర్ బినామీలు అని అన్నారు.