హైదరాబాద్లో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X
హైదరాబాద్లో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆడపిల్ల అని తెలిసి గర్భంలోనే హత్య చేస్తున్నారని, అలాంటి పరిస్థితి మారాలని అన్నారు. మహిళలకు ఆస్తి హక్కులేదని, ఒకప్పడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మహిళల పరిస్థితి మరి దారుణంగా ఉండేదని అన్నారు. కానీ ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నారని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశమంతా మహిళలకు ఎలాంటి హక్కులు ఉన్నాయో అవే హక్కులను అక్కడి మహిళలకు కల్పించామని అన్నారు. సాయుధ బలగాల్లో కూడా మహిళలకు అవకాశం కల్పించామని అన్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు 1400 మంది మహిళలతో నృత్య ప్రదర్శన ఉంటుందని అన్నారు. అందుకోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కళాకారులను ఎంపిక చేశామని అన్నారు.