Home > తెలంగాణ > పిట్టను కొట్టబోయి వందేభారత్‌ను కొట్టాడు

పిట్టను కొట్టబోయి వందేభారత్‌ను కొట్టాడు

పిట్టను కొట్టబోయి వందేభారత్‌ను కొట్టాడు
X

పిట్టలను కొట్టి వాటిని అమ్మడం ద్వారా జీవనం సాగిస్తున్నాడు ఓ వ్యక్తి. ఈ క్రమంలోనే ఆదివారం తన గులేరుతో ఓ పిట్టను కొట్టబోయి అటుగా వచ్చిన వందే భారత్ ట్రైన్ కు కొట్టాడు. దీంతో ఆ ట్రైన్ అద్దాలు పగిలిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. జనగామ పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన హరిబాబు పిట్టలు కొట్టి తింటుంటాడు. ఈ క్రమంలోనే జనగామ సమీపంలో గులేరుతో పిట్టలు కొట్టడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న 20833 నంబర్ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ కు గులేరు నుంచి వచ్చిన రాయి తగిలి అద్దం పగిలింది. దీంతో రైల్వే పోలీసులు విచారణ జరపగా ఆ పని చేసింది హరిబాబు అని తేలింది. దీంతో రైల్వే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే తాను ఎప్పటిలాగే పిట్టను కొడుతుండగా పొరపాటున రాయి ట్రైన్ అద్దానికి తగిలిందని, తనను వదిలిపెట్టాలని హరిబాబు పోలీసులను ప్రాధేయపడ్డాడు.

Updated : 31 Dec 2023 7:43 PM IST
Tags:    
Next Story
Share it
Top