Home > తెలంగాణ > 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారు?.. మాజీ మంత్రి హరీశ్ రావు

100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారు?.. మాజీ మంత్రి హరీశ్ రావు

100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారు?.. మాజీ మంత్రి హరీశ్ రావు
X

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చి 17తో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన 100 రోజులు గడువు ముగుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి చివరి వారంలో లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందన్న హరీశ్ రావు..

ఎన్నికల కోడ్ సమయంలో పథకాలు ఎలా అమలు చేస్తారని నిలదీశారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి జీవో రిలీజ్ చేయాలని, అలా చేస్తే కోడ్ సమస్య ఉండదని అన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి అలా చేసే ఉద్దేశం లేదని అర్థమవుతోందని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే ఆరు గ్యారెంటీల్లోని 13 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ ఎన్నికల హామీల అమలును దాటవేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాల పేరుతో డ్రామాలాడుతోందని అన్నారు. ఓట్ ఆన్ బడ్జెట్ కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలని సూచించారు. ఈ సీజన్ నుంచే వరి పంటకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదని అన్నారు. కనీసం యాసంగి నుంచైనా బోనస్ అమలు చేయాలని, అందుకు ఎన్నికల కోడ్ అడ్డం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.

డిసెంబర్ 9 నాడే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్ల పెంపు, 200 యూనిట్ల లోపు విద్యుత్ బకాయిల మాఫీ అమలు చేస్తామని రేవంత్ ఎన్నికల సభల్లో హామీలు ఇచ్చారని, కానీ వాటి అమలు ఇంత వరకు నోచుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు ఎంతమందికి రైతు బంధు ఇచ్చిందో, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ అమలు చేసిందో అనే వివరాలను చెప్పాలన్నారు. సీఎం స్థాయి వ్యక్తి వాహనాలు దాచిపెట్టారు అని అనడం తగదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆ వాహనాలను ప్రభుత్వం కోసమే కొన్నామని, ప్రస్తుత ప్రభుత్వం ఆ వాహనాలను వాడుకోదా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ గురించి నాడు ఏదేదో మాట్లాడారన్న ఆయన.. మరీ ఇప్పడా భవనాన్ని సీఎం, డిప్యూటీ సీఎంలు ఎలా వాడుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటో కాల్ ఉల్లంఘన జరుగుతోందన్న హరీశ్ రావు.. నర్సాపూర్, జనగామ, హుజురాబాద్, సంగారెడ్డిలో తమ ఎమ్మెల్యేలను అగౌరవ పరిచిన ఘటనలే అందుకు సజీవ సాక్ష్యమని అన్నారు.

Updated : 31 Dec 2023 5:50 PM IST
Tags:    
Next Story
Share it
Top