Home > తెలంగాణ > గవర్నర్ ప్రసంగం నిరాశ కలిగించింది.. మాజీ మంత్రి హరీశ్ రావు

గవర్నర్ ప్రసంగం నిరాశ కలిగించింది.. మాజీ మంత్రి హరీశ్ రావు

గవర్నర్ ప్రసంగం నిరాశ కలిగించింది.. మాజీ మంత్రి హరీశ్ రావు
X

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజలకు నిరాశ కలిగించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.గవర్నర్ ప్రసంగంలో హామీల అమలుపై స్పష్టత లేదని అన్నారు. గవర్నర్ ప్రసంగం అంటే ఒక సంవత్సరానికి విజన్ డాక్యుమెంట్ అని.. కానీ నేటి గవర్నర్ ప్రసంగం అలా అనిపించలేదని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో వికలాంగులకు సంబంధించిన రూ.6 వేల పెన్షన్, రూ.15 వేల రైతు బంధు, రైతు రుణమాఫీ, వడ్లకు రూ.500 బోనస్, మహిళలకు రూ.2500, నిరుద్యోగులకు రూ.4 వేల భృతిల గురించి ఎలాంటి ప్రస్తావన లేదని అన్నారు. గవర్నర్ తన ప్రసంగంలో రెండే అంశాలు చెప్పారంటే మిగతావి చేయడం లేదని అనుమానం వస్తోందని అన్నారు. మహాలక్ష్మి స్కీమ్ లో మూడింటిలో ఒకటి మాత్రమే అమలు చేశారని, కానీ తమ ప్రభుత్వం ఇప్పటికే రెండు హామీలు అమలు చేస్తోందని అసత్యాలను ప్రచారం చేశారని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఒకటే హామీ అమలు చేశారని అన్నారు.

రైతులకు ఇచ్చిన నాలుగు హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదని అన్నారు. 15 వేల రైతు బంధు ఇవ్వడం ఏమో గానీ గతంలో ఉన్న 10 వేలు కూడా ఇవ్వడం లేదని అన్నారు. రైతుల రుణమాపీ విషయంలో నిర్ణయం తీసుకోకుండా మోసం చేశారని అన్నారు. వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వకుండా ద్రోహం చేశారని, యాసంగి పంటకైనా బోనస్ ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేదని అన్నారు. రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి కనీసం 15 గంటలకు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. మహాలక్ష్మి కింద మహిళలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల హామీల్లో చెప్పారని కానీ వాళ్లకు ఎప్పటి నుంచి ఈ డబ్బు ఇస్తారో అనే విషయం మాత్రం చెప్పడం లేదని అన్నారు. ప్రజావాణికి మంత్రులు వెళ్లడం లేదని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అప్లికేషన్లు తీసుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే 61 రోజులు అయిపోయాయని, వాళ్లు ఇచ్చిన గడువుకు 40 రోజులు మాత్రమే ఉందని అన్నారు. ఇంకో కొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రానుందని, మరి హామీలను 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని నిలదీశారు. అంటే ఆరు గ్యారెంటీలను తాము అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకనే చెప్పిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిందని, రానున్న ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు.


Updated : 8 Feb 2024 9:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top