సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించుకోండి.. హరీశ్ రావు
X
తమ (బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ మంత్రులు ఆరోపించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉందని అన్నారు. కావాలనే తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ మంత్రులు బురద చల్లేందుకుప్రయత్నిస్తున్నారని అన్నారు. తాము ఏ పని చేసిన ప్రజల కోసమే చేశామని అన్నారు. విద్య, వైద్యంతో పాటు అనేక కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేశామని, ఎలాంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదని అన్నారు. కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమ హయాంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించుకోవచ్చని అన్నారు. ఆ విచారణలో తాము కడిగిన ముత్యంలా బయటకు వస్తామని అన్నారు. సభలో తమను మాట్లాడనీయకుండా మంత్రులు తమ గొంతు నొక్కుతున్నారని హరీశ్ రావు అన్నారు. ఇక హరీశ్ రావు అసెంబ్లీలో మాట్లాడుతున్న సమయంలో మంత్రులు పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, శ్రీధర్ బాబు అడ్డుకునే ప్రయత్నం చేశారు.