Home > తెలంగాణ > కేసీఆర్ దెబ్బకి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది.. Harish Rao

కేసీఆర్ దెబ్బకి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది.. Harish Rao

కేసీఆర్ దెబ్బకి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది.. Harish Rao
X

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు విరుచుకుపడ్డారు. కేసీఆర్ దెబ్బకి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చిందని అన్నారు. నల్గొండలో కేసీఆర్ సభకు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీ తీర్మానం చేశారని అన్నారు. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఈరోజు దాని మీద చర్చ పెట్టకుండా పక్కకు పెడుతూ చలో నల్లగొండ సభ వల్ల కేఈర్ఎంబీ తీర్మానం చేశారని అన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించం అని కాంగ్రెస్ పార్టీ ఈరోజు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడం ఇది తెలంగాణ ప్రజల, బీఆర్ఎస్ పార్టీ విజయం అని అన్నారు. తమ నల్గొండ సభకు ఒక్క రోజు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పును సరిదిద్దుకుందని, అందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్లకు ధన్యవాదాలు అని ఎద్దేవా చేశారు. ఇక రానున్న రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు.

ఇక అంతకుముందు కరీంనగర్ లో తరిమితే కేసీఆర్ పాలమూరుకు వచ్చారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా కారణాలు ఉంటాయని, అభ్యర్థులు తమకు నచ్చిన నియోజవర్గాల్లో పోటీ చేస్తారని అన్నారు. కేసీఆర్ ను తరిమి కొట్టారని సీఎం రేవంత్ అంటున్నారన్న హరీశ్ రావు.. మరి కొడంగల్‌లో రేవంత్‌ను తరిమితే ఆయన మల్కాజిగిరికి వచ్చారా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. గతంలో నల్గొండలో కాంగ్రెస్ సున్నా సీట్లు ఉండేవని, ఈ సారి వాళ్లకు మెజారిటీ వచ్చాయని అన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలేనని అన్నారు. అధికారంలోకి వచ్చామని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే కుదరదని అన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్‌ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.

Updated : 12 Feb 2024 9:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top