Home > తెలంగాణ > సీఎం రేవంత్ను కలిసిన హీరో బాలకృష్ణ

సీఎం రేవంత్ను కలిసిన హీరో బాలకృష్ణ

సీఎం రేవంత్ను కలిసిన హీరో బాలకృష్ణ
X

సీఎం రేవంత్ రెడ్డిని హీరో నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ప్రముఖ బ్యాట్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా సీఎంను కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎంకు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలను సీఎం రేవంత్ హీరో బాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ కు సంబంధించిన పలు సమస్యలను నాగార్జున సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక క్రీడా రంగానికి సంబంధించిన పలు విషయాలను పీవీ సింధును అడిగి తెలుసుకున్నారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు సినీ ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విషెస్ చెప్పారు.


Updated : 30 Dec 2023 3:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top