Home > తెలంగాణ > గవర్నర్ కోటా ఎమ్మెల్సీల తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
X

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు పిటిషన్ పై న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రభుత్వం సిఫారసు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు ప్రతిపాదనలు పంపింది. అయితే వాటిని ఆమె తిరస్కరించారు. కాగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో వారి నియామకాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై పలు దఫాలుగా వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ ఎన్నికపై స్టేటస్ కో కొనసాగనుంది.


Updated : 15 Feb 2024 11:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top