Home > తెలంగాణ > TSRTC : సమ్మెకు దిగుతాం.. టీఎస్ఆర్టీసీకి అద్దె బస్సు ఓనర్ల వార్నింగ్

TSRTC : సమ్మెకు దిగుతాం.. టీఎస్ఆర్టీసీకి అద్దె బస్సు ఓనర్ల వార్నింగ్

TSRTC : సమ్మెకు దిగుతాం.. టీఎస్ఆర్టీసీకి అద్దె బస్సు ఓనర్ల వార్నింగ్
X

ఇటీవల రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ పథకంపై మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏ బస్సులో చూసినా మహిళలే కనిపిస్తున్నారంటూ చర్చ నడుస్తోంది. అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై టీఎస్ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడం మంచిదే కానీ ఓవర్ లోడ్ తో తమ బస్సులు పాడవుతున్నాయని అంటున్నారు. ప్రయాణికుల రద్దీతో కొన్ని బస్సుల టైర్లు పేలి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలోనే అద్దె బస్సుల్లో రూల్స్ ప్రకారం ప్రయాణికులను ఎక్కించుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువమందిని ఎక్కించుకోవద్దని టీఎస్ఆర్టీసీ ముఖ్య అధికారులకు విన్నవించినా వాళ్లు పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో కొత్త బస్సులు కొనాలని, అద్దె బస్సులను తీసుకోవాలని టీఎస్ఆర్టీసీకి చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఓవర్ లోడ్ వల్ల ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని అద్దె బస్సు ఓనర్లు టీఎస్ఆర్టీసీకి వార్నింగ్ ఇచ్చారు.

Updated : 2 Jan 2024 1:55 PM GMT
Tags:    
Next Story
Share it
Top