Home > తెలంగాణ > మా మీది కోపం రైతుల మీద చూపించకండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి

మా మీది కోపం రైతుల మీద చూపించకండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి

మా మీది కోపం రైతుల మీద చూపించకండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి
X

తమ మీది కోపం రైతుల మీద చూపించవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సాగు నీరు అందక తన నియోజకవర్గంలోని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడయో ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సాగు నీరు వదలాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశానని అన్నారు. అందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓకే చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు కూడా విడుదల చేయలేదని అన్నారు. దీంతో సాగు నీరు రాక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే భూగర్భ జలాలు ఇంకిపోయి బావులు, బోరు బావుల్లో నీళ్లు లేకుండా పోతున్నాయని అన్నారు. ఈ క్రమంలోనే చేతికొచ్చిన పంట ఎండిపోతుందేమోననే ఆందోళన రైతుల్లో నెలకొందని అన్నారు. సాగు నీటి విడుదల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షత చూపుతోందని అన్నారు.

తన మీద ఏమైనా కోపం ఉంటే తన మీదే తీర్చుకోవాలని, అంతేగానీ రైతులను మాత్రం ఇబ్బందిపెట్టవద్దని కోరారు.కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు సకాలంలో సాగునీరు అందేదని, కానీ నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన నిజస్వరూపం చూపిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రజలకు పథకాలు అందకుండా కుట్ర చేస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే తమ నియోజకవర్గానికి సాగు నీరు రాకుండా అడ్డుకుంటుందని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాజకీయ కుట్ర మానుకోవాలని, ప్రజలను దృష్టిలో పెట్టుకొని పథకాలు సకాలంలో అందించాలని అన్నారు. తన నియోజకవర్గానికి వెంటనే సాగు నీరు విడుదల చేయాలని, లేకుంటే హుజురాబాద్ లో మంత్రులను తిరగనివ్వమని హెచ్చరించారు.

Updated : 26 Feb 2024 9:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top