Home > తెలంగాణ > '12th ఫెయిల్' స్ఫూర్తిదాయకం.. కానీ: సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్

'12th ఫెయిల్' స్ఫూర్తిదాయకం.. కానీ: సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్

12th ఫెయిల్ స్ఫూర్తిదాయకం.. కానీ: సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్
X

ఇటీవల విడుదలైన '12th ఫెయిల్' అనే మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మనోశ్ కుమార్ అనే ఓ ఐపీఎస్ అధికార జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన పెద్ద విజయాన్ని అందుకుంది. కష్టపడితే పాస్, ఫెయిల్ తో సంబంధం లేకుండా జీవితంలో ఎదగొచ్చనే ఆ సందేశాన్ని ఈ సినిమా ప్రేక్షకులు అందించింది. కాగా ఈ మూవీపై సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 12th ఫెయిల్ ఓ స్ఫూర్తిదాయకమైన మూవీ అని అన్నారు. కానీ 12th పాస్ అనేది ఓ స్వీట్ మెమరీ అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆమె తన 12వ తరగతి మెమోకు సంబంధించిన ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. 12వ తరగతిలో తాను 'ఏ గ్రేడ్' సాధించానని, ఆ రిజల్ట్స్ తనలో ఓ విశ్వాసాన్ని కలిగించి జీవితంలో ఎదగడానికి ఉపయోగపడ్డాయని అన్నారు. "హార్డ్ వర్క్ చేయాలి.. అలాగే స్మార్ట్ వర్క్ చేయాలి. పరీక్షలో విషయ పరిజ్ఞానంతో పాటు దాన్ని వ్యక్తపరిచే స్కిల్స్ కూడా ఉండాలి" అని యూపీఎస్సీ అభ్యర్థులకు స్మితా సబర్వాల్ సూచించారు.


Updated : 9 Feb 2024 2:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top