రాజకీయ నాయకులు ఇక నుంచి ఆ పదాలు ఉండొద్దు.. ఈసీ కీలక ఆదేశాలు
X
రాజకీయ పార్టీల నేతలు ఉపన్యాసాల్లో ఉపయోగించే భాషపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. నేతలు తమ ప్రసంగాల్లో దివ్యాంగుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని కోరింది. దివ్యాంగుల గురించే మాట్లాడే సమయంలో వారి వైకల్యాన్ని తెలిపే పదాలను వాడకుండా చూసుకోవాలని సూచనలు చేసింది. అందులో భాగంగా మూగ, పాగల్, అంధ, గుడ్డి, కుంటి, చెవిటి వంటి పదాలను నేతలు తమ ప్రసంగాల్లో వాడొద్దని ఈసీ కోరింది. ఇలాంటి పదాలను వాడటం వల్ల దివ్యాంగుల ఆత్మస్థైర్యం దెబ్బ తిని వాళ్లు జీవితంలో ఎదగలేరని పేర్కొంది. వాళ్లను సమాజంలోని మిగతావాళ్లతో సమానంగా ఎదిగేలా పొలిటికల్ పార్టీలు వాళ్లకు తోడ్పాటు అందించాలని తెలిపింది. అలాగే సోషల్ మీడియా వేదికలు, ఇతర మీడియా వేదికల్లో కూడా దివ్యాంగులను అవమానించే పదాలు వస్తే వాటిని గుర్తించే బాధ్యతను రాజకీయ పార్టీలు, నేతలు తీసుకోవాలని కోరింది. ఆయా వేదికల్లో అలాంటి పదాలను గుర్తించాక తొలగించేలా రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని ఈసీ కోరింది.