సీఎం రేవంత్ను కలిసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్
Vijay Kumar | 7 Feb 2024 6:41 PM IST
X
X
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి వచ్చిన ఆయన.. సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం జరిగింది. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాశ్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎన్ఆర్ఎస్సీ అధికారులు పాల్గొన్నారు.
Updated : 7 Feb 2024 6:41 PM IST
Tags: Telangana CM Revanth Reddy ISRO Chairman S.Somnath Dr.BR Ambedkar secretariat Telangana State Aviation Academy MoU ISRO National Remote Sensing Center(NRSC) CEO SN Reddy NRSC Director Prakash Chauhan Komati Reddy Venkat Reddy
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire