Home > తెలంగాణ > Rythu Bandhu : ఇక నుంచి వాళ్లకు 'రైతు బంధు' కట్.. సోషల్ మీడియాలో వైరల్!

Rythu Bandhu : ఇక నుంచి వాళ్లకు 'రైతు బంధు' కట్.. సోషల్ మీడియాలో వైరల్!

Rythu Bandhu : ఇక నుంచి వాళ్లకు రైతు బంధు కట్.. సోషల్ మీడియాలో వైరల్!
X

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకంలో మార్పులకు నిర్ణయించింది. దీనిపైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రైత బంధు సాయానికి పరిమితులు విధించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎవరికి ఈ పథకం వర్తింపజేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఫలానా వ్యక్తులకు రైతు బంధు రాదంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆదాయపు పన్ను కట్టే ధనవంతులు, సినిమా హీరో హీరోయిన్లు, కంపెనీ యజమానులు, పెద్ద ఉద్యోగులు, ఫార్మ్ హౌస్ యజమానులకు ఇక నుంచి రైతు బంధు రాదు అంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే ⁠విదేశాలలో ఉద్యోగాలు చేసే వాళ్లు, విదేశాలలో స్థిరపడిన వాళ్ళు ( మిడిల్ ఈస్ట్ లో చిన్నాచితక పనులు చేసేవాళ్లు మినహాయించి), పంట పండించని భూ యజమానులకు రైతు బంధు బంద్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదేవిధంగా 7.5 ఎకరాలకు మించి ఉన్న రైతులకు కూడా రైతు బంధు రాదంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సిందే.




Updated : 8 Jan 2024 7:22 PM IST
Tags:    
Next Story
Share it
Top