Home > తెలంగాణ > తెలంగాణ హక్కులు పరాయిపాలు అవుతున్నాయి.. Jagadish Reddy

తెలంగాణ హక్కులు పరాయిపాలు అవుతున్నాయి.. Jagadish Reddy

తెలంగాణ హక్కులు పరాయిపాలు అవుతున్నాయి.. Jagadish Reddy
X

కేసీఆర్ సారధ్యంలో సాధించుకున్న హక్కులు పరాయిపాలు అవుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. నల్గొండ శివారు మర్రిగూడ బైపాస్ వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో జగదీశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా లేకపోతే ప్రజలు బతుకులు ఆగమైతాయని కేసీఆర్ భావించి రాష్ట్రాన్ని తెస్తే.. నేటి ప్రభుత్వం వాటా లేకుండా చేస్తోందని అన్నారు. నాడు ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్.. నేడు మలిపోరాటానికి శ్రీకారం చుట్టడానికి నల్గొండ గడ్డకు వచ్చారని అన్నారు. కేసీఆర్ నల్లగొండకు వచ్చి ఏం చేశారనే అడిగే వెధవలకు తాను చెప్పే సమాధానం ఒకటేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కలిగిన కరువు కాటకాలు, ఆత్మహత్యలను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కేసీఆర్ లేకుండా చేశారని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని కేసీఆర్ మళ్లీ పోరాటం ప్రారంభించారని అన్నారు. 50 సంవత్సరాలు ఫ్లొరోసిస్ మహమ్మారిని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషించిందని ఎద్దేవా చేశారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 6 ఏండ్లలోనే తరిమి కొట్టారని అన్నారు.

తెలంగాణ వచ్చిన మొదట్లో కేవలం 3 లక్షల టన్నుల వరిని ఉత్పత్తి చేసిన నల్లగొండను.. నాలుగేండ్లలోనే 40 లక్షల టన్నుల ఉత్పత్తి చేసే స్థాయికి కేసీఆర్ తీసుకెళ్లారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని, వారన్నట్లు అధికారంలోకి రాగానే కరెంట్ ను ను మాయం చేశారని సెటైర్లు వేశారు. నల్లగొండలో 10 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదారు ఎకరాలకు నీళ్లిస్తూ పెద్ద మార్పు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏం తెచ్చారో ఒక్కసారి లెక్కలేసుకుంటే, చూస్తే తెలుస్తదన్న జగదీశ్ రెడ్డి.. ఊరకుక్కల్లా మాట్లాడితే ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మ ఉంటే కదా కేసీఆర్ గురించి కాంగ్రెస్ నేతలకు అర్థం కావటానికని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా పాల్గొంటే కదా కేసీఆర్ గొప్పతనం గురించి అర్థమయ్యేదని అన్నారు. కేసీఆర్ నల్లగొండలో సభ పెడుతున్నారని తెలిసేసరికి కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలైందని అన్నారు.

Updated : 13 Feb 2024 12:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top