Home > తెలంగాణ > ముగిసిన 'పందెంకోడి' కథ

ముగిసిన 'పందెంకోడి' కథ

ముగిసిన పందెంకోడి కథ
X

కరీంనగర్ ఆర్టీసీ డిపోలోని పందెం కోడి వ్యవహారం సినిమా ట్విస్టులను తలపిచింది. ఈ నెల 9న ఆర్టీసీ బస్సు డిపో-2 సెక్యూరిటీ గార్డుల తనిఖీలో పందెం కోడి దొరికిన విషయం తెలిసిందే. ఆ కోడికి ఇవాళ వేలం పాట నిర్వహించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పశు సంవర్ధక శాఖ జోక్యంతో వేలం ఆగిపోయింది. బ్లూ క్రాస్ సంస్థ ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. దీంతో డిపో-2 మేనేజర్ మల్లయ్య ఆధ్వర్యంలో ప్రముఖ జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ బ్లూక్రాస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తూము నారాయణకు పందెం కోడిని అప్పగించారు. కాగా ఈ నెల 9న కరీంనగర్ డిపో2కు చెందిన ఆర్టీసీ బస్సులో పందెం కోడి దొరికింది. దీన్ని కండక్టర్ డిపోలో అప్పగించాడు. కోడి గురించి ఎవరూ రాకపోవడంతో నిబంధనల ప్రకారం వేలం వేయడానికి సిద్ధమయ్యారు ఆర్టీసీ అధికారులు. అయితే కోడి తనదంటూ నెల్లూరు జిల్లాకు చెందిన వల్లపు మహేష్ ఇవాళ ఓ వీడియో రిలీజ్ చేశాడు. వేలం పాటను ఆపాలని ఆర్టీసీ అధికారులను కోరాడు. అయితే కోడి వేలాన్ని ఆపబోమని ఆర్టీసీ అధికారులు తేల్చి చెప్పారు. లాస్ ఆఫ్ ప్రాపర్టీ కింద మరిచిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత వేలం వేస్తామని తెలిపారు. అవసరమైతే కోడి బాధితుడు వేలంలో పాల్గొనాలని సూచించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 20 మంది వేలంలో పాల్గొనడానికి వచ్చారు. అయితే పందెంకోడి విషయం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవడంతో బ్లూ క్రాస్ సంస్థ రంగంలోకి దిగింది. పందెంకోడిని సంరక్షించడంతో కథ సుఖాంతం అయ్యింది.

Updated : 12 Jan 2024 9:31 PM IST
Tags:    
Next Story
Share it
Top