Home > తెలంగాణ > రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ న్యూ ఇయర్ విషెస్

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ న్యూ ఇయర్ విషెస్

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ న్యూ ఇయర్ విషెస్
X

రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఈ నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. కొత్త ఆశలు, ఆకాంక్షలతో ఉత్సాహంగా నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థించారు. 2024లో ప్రజలు తాము అనుకున్న అన్ని పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కాగా తుంటికి గాయం కావడంతో కేసీఆర్ కు యశోదా ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. చికిత్స అనంతరం కేసీఆర్ ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

Updated : 31 Dec 2023 10:01 PM IST
Tags:    
Next Story
Share it
Top