Home > తెలంగాణ > అసెంబ్లీ అవరణలో కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్

అసెంబ్లీ అవరణలో కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్

అసెంబ్లీ అవరణలో కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్
X

అసెంబ్లీ అవరణలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేక్ కట్ చేసి కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌషిక్ రెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకు ముందు తెలంగాణ భవన్ లో కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. ముందుగా తెలంగాణ తల్లి, ప్రొ.జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తలసాని సాయి కిరణ్ యాదవ్ సహకారంతో 1,000 మంది ఆటో డ్రైవర్ లకు ఒకొక్కరికి రూ.1 లక్ష కవరేజీతో కూడిన ఇన్సురెన్స్ పత్రాలను కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే 10 మంది దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పుట్టిన రోజును పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.

Updated : 17 Feb 2024 9:17 PM IST
Tags:    
Next Story
Share it
Top