KCR Birthday.. కేటీఆర్ చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాలు
X
తెలంగాణ భవన్ లో ఈరోజు కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. ముందుగా తెలంగాణ తల్లి, ప్రొ. జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తలసాని సాయి కిరణ్ యాదవ్ సహకారంతో 1000 మంది ఆటో డ్రైవర్ లకు ఒకొక్కరికి రూ.1 లక్ష కవరేజీతో కూడిన ఇన్సురెన్స్ పత్రాలను కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే 10 మంది దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు.
ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ కల్పించింది. కాగా దీంతో తమ ఉపాధి దెబ్బతిన్నదని ఆటోడ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారని, తమ ఆటోలను ఎక్కేవాళ్లు లేరంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్లు ఆందోళన దిగారు. తమకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.